Murder: 'మర్డర్' విడుదలకు అనుమతి లభించిన నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు!

Varma Comments After Gets Permission for his Film MURDER
  • వాస్తవాల ఆధారంగా ఎన్నో సినిమాలు తీశాను
  • ఎవరినీ కించపరచ లేదు
  • 'మర్డర్' వారి కథ కాదన్న వర్మ
తాను నిర్మించిన 'మర్డర్' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో, నిర్మాతలు నట్టి కుమార్, నట్టి కరుణలతో కలిసి మీడియాతో మాట్లాడిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వాస్తవ ఘటనలను ఆధారంగా తీసుకుని, గతంలో ఎన్నో చిత్రాలను నిర్మించానని, అవన్నీ ఎవరినీ ఉద్దేశించినవి కాదని అన్నారు. ఇప్పుడు తీసిన 'మర్డర్' కూడా ఫలానా వాళ్ల జీవితమని ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు.

చాలా పాప్యులర్ అయిన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తీశానని అందరూ అనుకున్నారని, అది కాదని తాను ఎన్నడో చెప్పానని, ఇక, కేసులు పెట్టిన వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయని అన్నారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశాలు లేవని, ఎన్నడూ కించపరచలేదని అన్నారు. గతంలోనూ తాను శివ, సర్కార్, రక్తచరిత్ర వంటి చిత్రాలను వాస్తవ జీవితంలో జరిగిన ఇతివృత్తాలను తీసుకునే నిర్మించానని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని వర్మ అన్నారు. 


Murder
Ram Gopal Varma
Movie

More Telugu News