Bihar: బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... ఎన్టీయే కూటమికి ఎదురుగాలి!

  • బీహార్ లో ముగిసిన ఎన్నికలు
  • ఈ నెల 10న ఫలితాలు
  • ఎగ్జిట్ పోల్స్ సందడి షురూ
Bihar exit polls

బీహార్ లో కొద్దిసేపటి కిందట చివరిదైన మూడో దశ పోలింగ్ ముగిసింది. మొత్తం మూడు దశలు ముగియడంతో బీహార్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి.

తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడించింది. విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ (ఎంజీబీ) కూటమికి 100 నుంచి 115... బీజేపీ, అధికార జేడీయూలతో కూడిన ఎన్డీయే కూటమికి 90 నుంచి 110 స్థానాలు... ఎల్జేపీకి 3 నుంచి 5 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

ఇక టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వేలో ఎంజీబీ కూటమికి 120... ఎన్డీయే కూటమికి 116, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు దక్కుతాయని పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ ఆధారంగా ఏబీపీ న్యూస్-సీ ఓటర్ జరిపిన సర్వేలో ఎంజీబీ కూటమికి 108 నుంచి 131 స్థానాలు, ఎన్డీయేకి 104 నుంచి 128 స్థానాలు లభిస్తాయని వివరించారు.

రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వేలో... ఎంజీబీ కూటమికి 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీయే కూటమికి 91 నుంచి 117 స్థానాలు, ఎల్జేపీకి 5 నుంచి 8 స్థానాలు, ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలుస్తారని అంచనా వేశారు.

More Telugu News