Nandigam Suresh: లోకేశ్ గురించి చంద్రబాబు ఎంత ఆలోచించినా వేస్టే: నందిగం సురేష్

Lokesh will spoil TDP says Nandigan Suresh
  • దళితుల పేరుతో రాజకీయం చేస్తున్నారు
  • లోకేశ్ ను ఎంత నిలబెట్టాలని చూసినా ప్రయోజనం లేదు
  • ట్రాక్టర్ ను తోసేసినట్టు పార్టీని కూడా తోసేస్తాడని అనుకుంటున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, అగ్రనేత నారా లోకేశ్ లపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితులను చంద్రబాబు ఎంత దారుణంగా చూశారో అందరికీ తెలుసని చెప్పారు. 2014 నుంచి చంద్రబాబు తీరును తట్టుకోలేకే దళితులంతా ఆయనకు వ్యతిరేకంగా ఏకమయ్యారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో ఒక మేధావి నడుస్తున్నారని... జైభీమ్ అంటూ చంద్రబాబు అజెండాను మోస్తున్నారని లోకేశ్ పై విమర్శలు గుప్పించారు.

జగన్ కు దళితుల మద్దతు లేదని టీడీపీ నేతలు అంటున్నారని... టీడీపీ హయాంలో దళితులపై దాడులు జరిగినప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ కు మద్దతుగా ఉండటంతో... దళితుల పేరుతో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేశ్ ను చంద్రబాబు ఎంత నిలబెట్టాలని చూసినా ప్రయోజనం లేదని, అంతా వేస్టని అన్నారు. మొన్న ట్రాక్టర్ ను తోసినట్టు పార్టీని కూడా లోకేశ్ తోసేస్తారని టీడీపీ నాయకులే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Nandigam Suresh
Jagan
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News