Neeraj Jha: బీహార్ ఎన్నికల్లో విషాదం... కరోనాతో అభ్యర్థి మృతి

  • బేనిపట్టి నియోజకవర్గంలో ఘటన
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నీరజ్ ఝా
  • నామినేషన్ రోజే అస్వస్థత
  • అలాగే ప్రచారంలో పాల్గొన్న నీరజ్ ఝా
Independent candidate Neeraj Jha dies of corona in Bihar

బీహార్ లో నేడు చివరిదైన మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే, ఓ స్వతంత్ర అభ్యర్థి కరోనాతో మృతి చెందిన ఘటన బేనిపట్టి నియోజకవర్గంలో జరిగింది. బేనిపట్టి నియోజకవర్గం నుంచి నీరజ్ ఝా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

అయితే ఆయన నామినేషన్ రోజే అస్వస్థత పాలయ్యారు. కొన్నిరోజుల కిందట ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఆరోగ్యం క్షీణించింది. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. పాట్నా ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ నీరజ్ ఝా నేడు ప్రాణాలు విడిచారు.

నీరజ్ ఝా గత ఎనిమిదేళ్లుగా జేడీయూలో అనేక పదవుల్లో కొనసాగారు. ఆయనకు జేడీయూ ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది. దాంతో పార్టీకి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా బరిలో దిగారు.

More Telugu News