Mukesh Ambani: కామాఖ్యదేవి ఆలయానికి భారీగా బంగారం విరాళం ఇచ్చిన అంబానీ దంపతులు

Mukesh Ambani donates huge amount of gold to Kamakhya Temple
  • గోపుర కలశాల కోసం 20 కిలోల బంగారం విరాళం
  • ప్రారంభమైన నిర్మాణ పనులు
  • త్వరలోనే అమ్మవారిని దర్శించుకోనున్న ముఖేశ్, నీతా
అసోంలోని కామాఖ్యదేవి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తాజాగా ఈ ఆలయానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు భారీ ఎత్తున బంగారం విరాళంగా ఇచ్చారు. ఆలయ గోపుర కలశాల తయారీ కోసం 20 కిలోల పసిడిని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారంతో మూడు గోపుర కలశాలు రూపొందిస్తున్నట్టు కామాఖ్య ఆలయ వర్గాలు వెల్లడించాయి.

మూడు నెలల కిందటే బంగారం విరాళం ఇచ్చేందుకు అంబానీ దంపతులు కామాఖ్య ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు తాము భరిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరఫున బంగారం అందించగా, కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఈ నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేశ్ అంబానీ, ఆయన అర్ధాంగి నీతా అంబానీ అసోంలోని కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం అసోంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
Mukesh Ambani
Kamakhya Temple
Gold
Nitha Ambani
Assam

More Telugu News