Anushka Sharma: నిన్నటి హైదరాబాద్, ఆర్సీబీ మ్యాచ్ ను తిలకించిన అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్

anushka sharma pics go viral
  • కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ మద్దతు
  • గర్భిణి అయినప్పటికీ భ‌ర్త‌తో క‌లిసి దుబాయ్‌లో హీరోయిన్
  • రెడ్ డ్రెస్ వేసుకుని మ్యాచ్ చూసిన అనుష్క
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచులు ఆడుతూ బిజీగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య, హీరోయిన్ అనుష్క శర్మ మద్దతుగా నిలిచింది. గర్భిణి అయినప్పటికీ ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి దుబాయ్‌లో ఉంటోంది. ఇటీవల విరాట్ కోహ్లీ అక్కడే తన బ‌ర్త్‌డే వేడుక జరుపుకున్నాడు.  

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుల మధ్య అనుష్క తన భర్త పుట్టినరోజు వేడుకను జరిపింది. త‌న భ‌ర్త బుగ్గకు ముద్దిస్తూ ఆమె దిగిన ఫొటో కూడా బయటకు వచ్చింది. ఐపీఎల్‌లో తన భర్త కోహ్లీ టీమ్ ఆడిన ప్ర‌తి మ్యాచ్‌కి ఆమె హాజ‌రయింది. నిన్న రాత్రి జ‌రిగిన హైదరాబాద్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌కు అనుష్క శర్మ రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే.
Anushka Sharma
Virat Kohli
IPL 2020

More Telugu News