Arnab Goswami: అసంపూర్తిగా ముగిసిన విచారణ.. అర్నాబ్‌కు దక్కని ఊరట!

  • 2018 నాటి కేసులో అరెస్ట్ అయిన అర్నాబ్ గోస్వామి
  • సమయాభావం వల్ల ఇతర పార్టీల వాదనలు వినలేకపోయిన కోర్టు
  • విచారణ నేటికి వాయిదా
TV Anchor Arnab Goswami To Be In Jail For Now

2018 నాటి ఆత్మహత్యల కేసులో అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ ప్రమోటర్ అర్నాబ్ గోస్వామికి హైకోర్టులో ఊరట లభించలేదు. మధ్యంతర బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు నిన్న విచారించింది. అయితే, సమయాభావం వల్ల ఇతర పార్టీల వాదనలు వినలేకపోవడంతో విచారణ అసంపూర్తిగా ముగిసింది. తిరిగి నేడు విచారణ కొనసాగిస్తామని చెప్పడంతో బెయిలు లభించలేదు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రతివాది, రాష్ట్రప్రభుత్వం, అన్వయ్ నాయక్ కుటుంబ సభ్యుల పిటిషన్‌ను విచారించనుంది.


ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్‌ల ఆత్మహత్యల కేసులో అర్నాబ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేసినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును తిరిగి తెరిచింది. అర్నాబ్‌ను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. అర్నాబ్ ప్రస్తుతం కోవిడ్ సెంటర్‌గా మార్చిన రాయ్‌గడ్‌లోని జిల్లా పరిషత్ స్కూల్‌లో ఉన్నారు.

More Telugu News