Undavalli Sridevi: తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

YCP MLA Undavalli Sridevi complains to police
  • సందీప్, సురేశ్ అనే వ్యక్తులతో ముప్పు ఉందని వెల్లడి
  • వారిద్దరూ ఇటీవలే వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు 
  • కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న శ్రీదేవి  
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నేత ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. సందీప్, సురేశ్ అనే వ్యక్తుల నుంచి తనకు ముప్పు ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సందీప్, సురేశ్ ఇటీవలే వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారని, పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Undavalli Sridevi
MLA
Police
Tadikonda
Guntur District
YSRCP

More Telugu News