ఐపీఎల్ ఎలిమినేటర్: బెంగళూరుకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు

06-11-2020 Fri 21:33
  • అబుదాబిలో ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు
Sunrisers Hyderabad bowlers restricts RCB batsmen successfully

అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జాసన్ హోల్డర్, నటరాజన్ వికెట్ల వేటలో ముందంజ వేయగా, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్ ఎంతో పొదుపుగా బౌలింగ్ చేశారు. దాంతో, మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బెంగళూరు జట్టులో ఏబీ డివిలియర్స్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరోన్ ఫించ్ 32 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ కు 3, నటరాజన్ కు 2 వికెట్లు లభించాయి. షాబాజ్ నదీమ్ ఓ వికెట్ తీశాడు. బెంగళూరు సారథి కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పడిక్కల్ 1 పరుగుకే నిష్క్రమించగా, మొయిన్ అలీ డకౌట్ అయ్యాడు.