Allu Arjun: పెళ్లి చేసుకుంటున్న తన ఉద్యోగికి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun surprises his employ by giving him a beautiful bachelor party
  • సర్ ప్రైజ్ చేసిన బన్నీ
  • బన్నీ పార్టీ ఇవ్వడంతో ఉద్యోగి సంబరం
  • గతంలోనూ సర్ ప్రైజ్ పార్టీలు ఇచ్చిన స్టయిలిష్ స్టార్
తన వద్ద పనిచేసే ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకోవడమే కాదు, వారిని ఆశ్చర్యపరిచే విధంగా వ్యవహరించడంలోనూ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. గతంలో తన బాడీగార్డు పుట్టినరోజును, తన పీఆర్ టీమ్ మెంబర్ పుట్టినరోజును కూడా తానే నిర్వహించాడు. తాజాగా, తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసే అభినవ్ అనే యువకుడ్ని అల్లు అర్జున్ సర్ ప్రైజ్ చేశాడు.

తన టీమ్ లో ఉద్యోగి అయిన అభినవ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలుసుకున్న బన్నీ ఊహించని విధంగా బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేశాడు. అంతేకాదు, అభినవ్ కు తెలియకుండా తన టీమ్ మెంబర్స్ అందరినీ పార్టీకి ఆహ్వానించి మరింత థ్రిల్ కు గురిచేశాడు. బన్నీ స్వయంగా వచ్చి, తనకు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడంతో అభినవ్ ఆనందం అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు విపరీతంగా సందడి చేస్తున్నాయి.
Allu Arjun
Abhinav
Bachelor Party
Assistant
Tollywood

More Telugu News