Anju Prasad: టాలీవుడ్ నిర్మాత పీడీవీ ప్రసాద్ కు భార్యా వియోగం

Producer PDV Prasad wife Anju Prasad passed away
  • గుండెపోటుకు గురైన పీడీవీ ప్రసాద్ భార్య అంజు
  • కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • సంతాపం తెలిపిన హారిక హాసిని, సితార సంస్థలు
తెలుగు చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పీడీవీ ప్రసాద్ కు భార్యా వియోగం కలిగింది. ఆయన అర్ధాంగి అంజు ప్రసాద్ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. అంజు ప్రసాద్ వయసు 53 ఏళ్లు. ఆమె గుండెపోటుకు గురయ్యారు. అంజు ప్రసాద్ ను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కార్డియాక్ అరెస్ట్ తో మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. పీడీవీ ప్రసాద్, అంజు దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

పీడీవీ ప్రసాద్ హారిక హాసిని బ్యానర్ పై తెరకెక్కే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. అంతేకాదు, సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తుంటారు. కాగా, భార్యను కోల్పోయిన పీడీవీ ప్రసాద్ కు హారిక హాసిని, సితార సంస్థలు ప్రగాఢ సంతాపం తెలిపాయి.
Anju Prasad
PDV Prasad
Demise
Hyderabad
Tollywood

More Telugu News