Tamil Nadu: అది ఆయన సొంత విషయం: నటుడు విజయ్ సొంతపార్టీ వార్తలపై సీఎం పళనిస్వామి

Tamil CM Palaniswami responds about actor vijay political party news
  • పార్టీ పెట్టడం అనేది ఆయన సొంత విషయం
  • దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు
  • విజయ్ పార్టీ పెట్టినా మాకొచ్చే నష్టమేమీ లేదు
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేశాడంటూ నిన్నటి నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వార్తలను నటుడు విజయ్ ఖండించాడు. తానేమీ పార్టీ పెట్టడం లేదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాడు. పార్టీ కోసం తన తండ్రి దరఖాస్తు చేశారని, దానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పాడు.

అంతేకాదు, ఆ పార్టీ కోసం తన ఫొటోలు కానీ, పోస్టర్లు కానీ వాడుకోవద్దని కుండబద్దలుకొట్టాడు. కాగా, విజయ్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి స్పందించారు. భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, వారికి ఆ హక్కు ఉందని అన్నారు. ఇక, విజయ్ పార్టీ పెట్టడం అనేది పూర్తిగా ఆయన సొంత విషయమని సీఎం పేర్కొన్నారు. ఆయన పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.
Tamil Nadu
Actor Vijay
Political party
Edappadi Palaniswami

More Telugu News