Flight Charges: దీపావళి కానుక... విమాన చార్జీలను భారీగా తగ్గించిన కేంద్రం!

  • కరోనా కారణంగా తగ్గిన ప్రయాణికుల సంఖ్య
  • ఇంకా పూర్తిగా ప్రారంభంకాని అంతర్జాతీయ సేవలు
  • డిమాండ్ ను పెంచే యోచనలో కేంద్రం
Discount in Flight Charges

ఈ దీపావళి సీజన్ లో విమానం చార్జీలను భారీగా తగ్గిస్తూ, కేంద్రం నిర్ణయించుకుంది. కరోనా కారణంగా ప్రజా రవాణాను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గిపోగా, విమానాలు ఎక్కేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. అయితే, ఈ పండగ సీజన్ ను ఉపయోగించుకుని, తిరిగి ప్రయాణికుల సంఖ్యను పెంచాలని భావిస్తున్న కేంద్రం, గత సంవత్సరంతో పోలిస్తే 30 నుంచి 40 శాతం మేరకు చార్జీలను తగ్గించింది.

తగ్గిన చార్జీల ప్రకారం, చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,700తోనే ప్రయాణించవచ్చు. ఇక హైదరాబాద్ కు రూ.2,400 నుంచి రూ.2,800 వరకూ, ఢిల్లీకి రూ. 4 వేల వరకూ చార్జీలను నిర్ణయించారు. ప్రస్తుతం అంతర్రాష్ట్రాల మధ్య మాత్రమే విమాన సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమానాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక హైదరాబాద్ నుంచి ప్రయాణాలకు కేంద్రం నిర్ణయించిన చార్జీలతో పాటు ఎయిర్ పోర్ట్ యూజర్ డెవలప్ మెంట్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి వుంటుంది.

More Telugu News