Sisters: ఒక కృష్ణుడు... ముగ్గురు భార్యలు!... ఉత్తరప్రదేశ్ లో విడ్డూరం!

Three sisters married one man in Uttar Pradesh
  • ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
  • 12 ఏళ్ల కిందట వివాహం
  • ఒక్క గొడవా లేకుండా అన్యోన్యంగా కాపురం

ఉత్తరప్రదేశ్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తి ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కలియుగ కృష్ణుడు పెళ్లాడిన ముగ్గురు అమ్మాయిల పేర్లు పింకీ, శోభ, రీనా. వారు ముగ్గురూ తోబుట్టువులే. చిన్నప్పటి నుంచి ఏంచేసినా కలిసే చేయడం అలవాటు. ముగ్గురూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

పెళ్లి విషయానికొచ్చినా తమ అలవాటు తప్పలేదు. చిత్రకోట్ కు చెందిన కృష్ణను పెళ్లాడారు. వీరి పెళ్లి జరిగి పన్నెండేళ్లు అవుతోంది. ఇటీవల కర్వాచౌత్ పండుగ సందర్భంగా వీరంతా తమ భర్త క్షేమం కోరుతూ చంద్రుడికి పూజలు చేశారు. జల్లెడ లోంచి తమ భర్తను చూస్తూ మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కాగా, కృష్ణకు మొత్తం ఆరుగురు పిల్లలట. ఒక్కో భార్యతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఇంతజేసీ మన కృష్ణుడికి ఒక్కరోజు కూడా భార్యలతో గొడవలు రాలేదట. వాళ్లందరూ చిత్రకోట్ లోని స్థానిక కంసీరామ్ కాలనీలో కలిసే ఉంటారని ఓ బంధువు వెల్లడించాడు. అయితే, కృష్ణ ఆ ముగ్గురినీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పటికీ తెలియదని అతగాడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Sisters
Marriage
One Man
Chitrakot
Uttar Pradesh

More Telugu News