Murder: గుంటూరు జిల్లాలో ఘోరం.... కళ్లలో స్ప్రే చల్లి హత్య!

Mystery murder in Guntur districts
  • 75 తాళ్లూరు గ్రామంలో ఘటన
  • చెత్త పారేసేందుకు వెళ్లిన హోటల్ యజమాని
  • బైక్ పై వచ్చి స్ప్రే చల్లిన దుండగులు
  • ఆసుపత్రికి వెళుతూ మార్గమధ్యంలో మృతి చెందిన వ్యక్తి
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కళ్లలో స్ప్రే చల్లి ఓ వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది. పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరు గ్రామంలో ఈ హత్య జరిగింది. భాష్యం బ్రహ్మయ్య అనే వ్యక్తి గ్రామంలో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. చెత్త పారవేసేందుకు బ్రహ్మయ్య ఊరి చివరకు వెళ్లాడు.

అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లి దాడి చేశారు. ఆ స్ప్రే కళ్లలో పడడంతో మంటలు పుట్టాయి. దాంతో కుటుంబ సభ్యులు బ్రహ్మయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. ఈ ఘటన పెదకూరపాడు మండలంలో తీవ్ర కలకలం రేపింది. బ్రహ్మయ్యను హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.
Murder
Guntur District
75 Talluru
Spray

More Telugu News