Abah Sarna: 17 ఏళ్ల పడుచుకు 78 ఏళ్ల ముదుసలితో పెళ్లి... మూడు వారాలకే పెటాకులు!

Indonesian elderly man send divorce papers to his teenage wife family memvers
  • ఇండోనేషియాలో ఘటన
  • భారీ కట్నకానుకలతో పెళ్లి
  • అమ్మాయి పెళ్లికి ముందే గర్భవతి అంటూ వృద్ధ భర్త ఆరోపణ

ఇండోనేషియాలో ఓ టీనేజి అమ్మాయికి ఓ వృద్ధుడితో పెళ్లి చేయగా, ఆ వివాహం మూడు వారాలకే విచ్ఛిన్నమైంది. అబా సార్నా అనే 78 ఏళ్ల ముదుసలికి 17 ఏళ్ల నోని నవితా అనే యువతితో పెళ్లి జరిగింది. వరుడు వయోభారంతో ఉన్నా ఈ పెళ్లి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఓ నవయువకుడికి సమర్పించుకున్న రీతిలోనే అబా సార్నాకు అమ్మాయి తరఫు వారు భారీగా కట్నకానుకలు ముట్టచెప్పారు. కొత్త కాపురం కోసం రెండు వాహనాల్లో వస్తుసామగ్రి తీసుకువచ్చారు.

అయితే వీరి దాంపత్యం కేవలం 22 రోజులు మాత్రమే సాగింది. తన భార్య నోని పెళ్లికి ముందే గర్భవతి అని, ఆ విషయం దాచి పెళ్లి చేశారంటూ పెళ్లికొడుకు అబా సార్నా ఆరోపించాడు. ఆమె నుంచి విడాకులు కోరుతున్నట్టు డైవోర్స్ పత్రాలు పంపడంతో అమ్మాయి కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.

ఆ ముసలి అల్లుడి ఆరోపణలు అన్నీ అవాస్తవాలని, తమ అమ్మాయి నోని గర్భవతి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. అబా సార్నాకే ఏదో సమస్య ఉండి ఉంటుందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నోనిపై అభాండాలు వేస్తున్నాడని వారు ప్రత్యారోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఈ అంశం విపరీతంగా వైరల్ అవుతోంది.

.

  • Loading...

More Telugu News