గంగానదిలో ఘోర ప్రమాదం... 70 మంది గల్లంతు!

05-11-2020 Thu 17:19
  • వందమందితో ప్రయాణిస్తున్న బోటు
  • బీహార్లోని భాగల్ పూర్ వద్ద ఘటన
  • 30 మందిని రక్షించిన స్థానికులు
Boat capsize in Ganga River at Bhagalpur district of Bihar
వందమంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోటు గంగానదిలో మునిగిపోయిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ లోని భాగల్ పూర్ వద్ద గంగానదిలో జరిగిన ఈ ప్రమాదంలో 70 మంది గల్లంతయ్యారు. పడవ మునకపై స్థానికులు వెంటనే స్పందించడంతో 30 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రత్యేక బృందాలు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. నౌగాచియా ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ కూలీలు నదిని దాటేందుకు బోటులో వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గంగా పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ దళాలు గల్లంతైన వారికోసం గాలిస్తున్నాయి.