Sand Policy: అన్ని ఇసుక రీచులు ఒకే ప్రైవేట్ సంస్థకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • కొత్త ఇసుక పాలసీకి ఆమోదముద్ర వేసిన ఏపీ కేబినెట్
  • సబ్ కమిటీ నివేదిక మేరకు నిర్ణయం
  • త్వరలో తీరనున్న ఇసుక కష్టాలు
AP govt brings new Sand Policy

ఇసుక పాలసీపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలను నిర్ణయం తీసుకుంది. ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో భేటీ అయిన ఏపీ కేబినెట్ కొత్త ఇసుక పాలసీకి ఆమోదముద్ర వేసింది. కొత్త ఇసుక పాలసీ ప్రకారం అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రీచులను అప్పగించాలని తొలుత ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ పట్ల మొగ్గు చూపకపోవడంతో... వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అన్ని రీచులను ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తే... రాష్ట్రంలో ఇసుక కష్టాలు తీరే అవకాశం ఉంది.

More Telugu News