jharkhand: ఝార్ఖండ్‌లో బాలుడిలో వెలుగు చూసిన పోలియో లక్షణాలు.. ఐఐఎస్‌కు నమూనాలు!

  • 2014లోనే పోలియో రహిత దేశంగా భారత్
  • గతేడాది 32 అనుమానిత కేసులు.. పోలియో కాదని నిర్ధారణ
  • అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు
6 year old boy in Jharkhand suspected of polio

పోలియో రహిత దేశంగా భారత్ అవతరించిన వేళ.. తాజాగా, ఝార్ఖండ్‌లో ఓ బాలుడిలో పోలియో లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. ఆరేళ్ల బాలుడిలో లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెరాలజీ (ఐఐఎస్) ‌కు పంపారు.

 అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ఇటీవల ఆసుపత్రిలో చేరగా, అతడికి చికిత్స అందించిన వైద్యులు పోలియో లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా నమూనాలు సేకరించి ఐఐఎస్‌కు పంపించారు. ఫలితం రావడానికి పదిహేను రోజులు పడుతుంది.

నిజానికి భారత్‌లో చాలా ఏళ్ల క్రితమే పోలియో మాయమైంది. 2014లో ప్రపంచ  ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించింది. అయితే, రెండేళ్ల క్రితం 13 కేసులను, గతేడాది 32 కేసులను పోలియోగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత కాదని తేలింది. తాజాగా ఆరేళ్ల బాలుడిలో ఆ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News