USA: గడ్డ కట్టించే చలిలోనూ వెచ్చదనాన్నిచ్చే దుస్తులను దిగుమతి చేసుకున్న సైన్యం!

  • వచ్చేసిన శీతాకాలం
  • అమెరికా నుంచి దుస్తులు, ఆయుధాల దిగుమతి
  • చిత్రాలు విడుదల చేసిన సైన్యం
Indian Army Imported Extreme Cold Wether Cloths

ఓ వైపు శీతాకాలం ప్రవేశిస్తుండటం, మరోవైపు సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్ నుంచి సవాళ్లు పెరుగుతున్న వేళ, హిమాలయ పర్వతాల్లో నెలకొన్న అత్యంత చలి వాతావరణంలోనూ శరీరాలను వెచ్చగా ఉంచే అత్యాధునిక దుస్తులను అమెరికా నుంచి భారత సైన్యం దిగుమతి చేసుకుంది. ఈ వింటర్ సీజన్ లో లడఖ్ లో మరింత ధైర్యంగా విధులను నిర్వర్తించేందుకు ఇవి ఉపకరిస్తాయని సైన్యాధికారులు వెల్లడించారు.

దిగుమతి చేసుకున్న దుస్తులతో జవాను ఎలా కనిపిస్తారన్న విషయాన్ని తెలియజేస్తూ, సైన్యం మీడియాకు ఓ చిత్రం విడుదల చేసింది. ఇందులో ఇటీవల దిగుమతి చేసుకున్న ఎస్ఐజీ సౌర్ అసాల్ట్ రైఫిల్ తో, పూర్తి వైట్ అండ్ వైట్ డ్రస్ లో ఉన్న జవాను చైనా బోర్డర్ లో విధులు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు.

అత్యంత శీతల పరిస్థితుల్లో ధరించేందుకు వీలైన దుస్తులను యూఎస్ నుంచి మంగళవారం నాడు అందుకున్నామని, ప్రస్తుతం మొత్తం 60 వేల దుస్తులు సైన్యానికి సిద్ధంగా ఉన్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. వీటిని తూర్పు లడఖ్ తో పాటు సియాచిన్, పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే వారికి అందిస్తామని తెలిపారు. ఈ స్టాక్ ను 90 వేలకు చేర్చాలని నిర్ణయించామన్నారు.

More Telugu News