KA Paul: అప్పుడే ఎలా చెబుతారు?: ట్రంప్ పై మండిపడ్డ కేఏ పాల్

  • ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే గెలిచానని ఎలా ప్రకటించుకున్నారన్న పాల్
  • టెన్షన్ పుట్టిస్తున్న ఎన్నికల ఫలితాలు
  • చాలా క్లోజ్ గా వెలువడుతున్న ఫలితాలు
KA Paul criticises Trump

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల ఓట్లను ఇంకా పూర్తిగా లెక్కించకముందే తానే గెలిచానంటూ ట్రంప్ ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. అవసరమైతే ఓట్ల లెక్కింపును ఆపాలని సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా కేఏ పాల్ విమర్శించారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ఫలితాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 238 స్థానాలను బైడెన్ కైవసం చేసుకుంటే...ట్రంప్ 213 చోట్ల గెలుపొందారు. ఇద్దరు కూడా వారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News