Chandrababu: ప్రభుత్వ ట్యాక్స్ లకు అదనంగా జే ట్యాక్స్, వైసీపీ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ లను వసూలు చేస్తున్నారు: చంద్రబాబు

  • నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు
  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు షాపులే
  • బీసీలను చులకనగా చూస్తున్నారు
YSRCP Govt is playing with peoples health says Chandrababu

మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్... మద్యం ధరలను మూడు, నాలుగు రెట్లు పెంచి అమ్ముతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నాసిరకం బ్రాండ్లను అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని చెప్పారు. ఎక్కడ చూసినా బెల్టు షాపులేనని మండిపడ్డారు. ప్రభుత్వ ట్యాక్సులకు తోడు అదనంగా జే ట్యాక్స్, వైసీపీ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ లను వసూలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు డబ్బు సంచుల లెక్కల్లో మునిగి తేలుతున్నారని దుయ్యబట్టారు.

మంచి ఇసుక విధానం తెస్తామని జనాలను నమ్మించి... ఏడాదిన్నరగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీని రద్దు చేసి మీరు సాధించింది ఏముందని ప్రశ్నించారు. బీసీలను వైసీపీ ప్రభుత్వం చులకనగా చూస్తోందని అన్నారు. టీడీపీకి బీసీలు కంచుకోటగా ఉంటారనే అక్కసుతో... బీసీలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత 2 బడ్జెట్లలో బీసీలకు ఎన్ని నిధులను కేటాయించారని ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనలో బీసీ కార్పొరేషన్లకు ఇచ్చిన నిధులు ఎన్ని అని నిలదీశారు.

More Telugu News