Priyanak Mohan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Priyanaka Mohan opposite Naga Chaitanya in Thank You movie
  • చైతు 'థ్యాంక్యూ'లో ప్రియాంక మోహన్ 
  • రామోజీ ఫిలింసిటీలో మణిరత్నం షూటింగ్
  • అమలాపురం పరిసరాల్లో 'కోతి కొమ్మచ్చి'  
*  విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడుగా 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరిగా ప్రియాంక అరుల్ మోహన్ ను తాజాగా ఎంపిక చేశారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రం షూటింగును హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నారు. దీపావళి తర్వాత షూటింగ్ ప్రారంభిస్తారు. ఇందులో ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి, మోహన్ బాబు, త్రిష తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'కోతి కొమ్మచ్చి' చిత్రం షూటింగ్ అమలాపురం పరిసరాల్లో మొన్నటినుంచి జరుగుతోంది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్ లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శ్రీహరి తనయుడు మేఘాంశ్, సతీశ్ వేగేశ్న తనయుడు సమీర్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు.
Priyanak Mohan
Naga Chaitanya
Maniratnam
Aishvarya Rai

More Telugu News