Avanthi Srinivas: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు కూడా కలిసిరావాలి: మంత్రి అవంతి

Avanthi talks about Polavaram project
  • టీడీపీ కారణంగానే పోలవరంపై గందరగోళమన్న అవంతి
  • ప్రాజెక్టు పూర్తికి అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపు
  • పోలవరం బాధ్యత కేంద్రానిదే అని ఉద్ఘాటన
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ కారణంగానే పోలవరం ప్రాజెక్టుపై గందరగోళం నెలకొందని, టీడీపీ లేనిపోని అంశాలు తీసుకువస్తోందని అన్నారు. ఈ కారణంగానే నిధుల విషయంలో వివాదం రేగిందని తెలిపారు. పోలవరం చంద్రబాబు ఏటీఎంలా మారిందని ప్రధానమంత్రే అన్నారని అవంతి వ్యాఖ్యానించారు.

పోలవరం బాధ్యత కేంద్రానిదేనని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అన్ని పార్టీలు కలసిరావాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు కూడా ముందుకు రావాలని అవంతి సూచించారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టు నిర్మాణంలో రాజకీయాలు తగవని హితవు పలికారు.
Avanthi Srinivas
Chandrababu
Polavaram Project
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News