Sunrisers Hyderabad: గెలిస్తేనే నిలుస్తారు... చావోరేవో మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్

  • ఐపీఎల్ లో నేడు ఆఖరి లీగ్ మ్యాచ్
  • షార్జాలో ముంబయి వర్సస్ హైదరాబాద్
  • బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్
  • బరిలో దిగుతున్న రోహిత్ శర్మ
Sunrisers Hyderabad won the toss in do or die match against Mumbai Indians

ఐపీఎల్ లో నేడు చివరి లీగ్ పోరు జరగనుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి జట్టు ప్లేఆఫ్స్ కు చేరగా, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సన్ రైజర్స్ ముందంజ వేస్తుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

నాకౌట్ దశ ముంగిట ముంబయి జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం ఏమిటంటే గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. కాగా, ప్లేఆఫ్స్ ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, బౌల్ట్ లకు ముంబయి జట్టు మేనేజ్ మెంట్ విశ్రాంతినిచ్చింది. వారి స్థానంలో జేమ్స్ ప్యాటిన్సన్, ధవళ్ కుల్ కర్ణి జట్టులోకొచ్చారు. ఇక, హైదరాబాద్ జట్టులో ఒక మార్పు జరిగింది. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియమ్ గార్గ్ ను తీసుకున్నారు.

More Telugu News