Dubbaka: దుబ్బాక నియోజకవర్గంలో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

  • సాయంత్రం 5 గంటలకు 81.44 శాతం ఓటింగ్
  • 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
  • ఈ నెల 10న ఫలితాలు వెల్లడి
Dubbaka by polls come to an end

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఇచ్చినట్టు వెల్లడించారు. సాధారణ ఓటింగ్ 5 గంటలకే ముగియగా, చివరి గంట కొవిడ్ బాధిత ఓటర్ల కోసం కేటాయించారు. దుబ్బాక నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ 85 శాతం ఓటింగ్ జరిగింది.

తాజాగా, మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా, అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. దుబ్బాక ఉప ఎన్నిక బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 23 మంది పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి దివంగత సోలిపేట రామలింగారెడ్డి అర్ధాంగి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న వెల్లడి కానున్నాయి.

More Telugu News