Bandi Sanjay: తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయి: బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay lauds Vijayasanthi
  • విజయశాంతిపై బండి సంజయ్ ప్రశంసలు జల్లు
  • విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నేత అని కితాబు
  • గ్రామాల్లో చైతన్యం తెచ్చారని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి బీజేపీలో చేరుతోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం విజయశాంతిపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే త్వరలోనే ఆమె కాషాయదళంలో చేరుతుందన్న వాదనలకు బలం చేకూరుతోంది.

విజయశాంతి ఎంతో ప్రజాదరణ ఉన్న నాయకురాలు అని, తెలంగాణ ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారని బండి సంజయ్ కొనియాడారు. తెలంగాణ గ్రామ ప్రజల్లో విజయశాంతి చైతన్యం కలిగించారని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని అన్నారు.
Bandi Sanjay
Vijayashanti
BJP
Congress
Telangana

More Telugu News