Atchannaidu: ఏపీఎస్ఆర్టీసీ లక్షకు పైగా కిలోమీటర్లను కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం: అచ్చెన్నాయుడు

  • ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం
  • ఈ ఒప్పందంతో ఆర్టీసీ మనుగడకే ముప్పుందన్న అచ్చెన్న
  • రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపాటు
TDP leader Atchannaidu reacts on RTC agreement between AP and Telangana

ఇవాళ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు రోడ్డెక్కనున్నాయి. చెరో 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుకునేందుకు ఇరు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే, ఈ ఒప్పందం ఏపీఎస్ఆర్టీసీ మనుగడకే ముప్పు వంటిదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.

ఏపీఎస్ఆర్టీసీ కొత్త ఒప్పందం కారణంగా లక్షకు పైగా కిలోమీటర్లను కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్టీసీనే కాకుండా కార్మికులను కూడా నష్టపరుస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని అచ్చెన్న విమర్శించారు. తెలంగాణలో బినామీ ఆస్తుల రక్షణకు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News