Anuj Mishra: యూపీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చితకబాదిన మహిళలు.. లైంగిక వేధింపుల ఫలితం!

Jalaun district Congress president beaten by women
  • జలౌన్ జిల్లాలో ఘటన
  • కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టని మహిళలు
  • తన ప్రత్యర్థుల కుట్ర అంటూ జిల్లా కాంగ్రెస్ చీఫ్ ఆరోపణలు

ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుజ్ మిశ్రా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు మహిళలు ఆయనను చితకబాదారు. గత కొంతకాలంగా అనుజ్ మిశ్రా తమను తీవ్రంగా వేధిస్తున్నాడని, అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మహిళలు అనుజ్ మిశ్రాను ఓ బహిరంగ ప్రదేశంలో దొరకబుచ్చుకుని చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఆ మహిళల కాళ్లకు మొక్కే ప్రయత్నం చేసినా వాళ్లు అతడిని వదిలిపెట్టలేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించారు. కాగా, ఆ మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తిన్న అనుజ్ మిశ్రా ఆ తర్వాత మాట్లాడుతూ, ఇది తన ప్రత్యర్థులు చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు పార్టీ పదవుల్లో ఉన్నారని, సీనియర్ నాయకుల ఆదేశాలతో తాను ఆమెను తొలగించానని, అందుకే తనపై కక్షబూని దాడి చేసిందని ఆరోపించారు. అంతేకాదు, ఆమె ఇల్లు కట్టుకుంటుంటే అవసరమైన మెటీరియల్ కు తానే డబ్బు చెల్లించానని అనుజ్ మిశ్రా వెల్లడించారు.

  • Loading...

More Telugu News