Vijay Sai Reddy: జగన్ లాంటి వారు సీఎంగా ఉండుంటే ఎర్రన్నాయుడు ఆక్సిజన్ అందక చనిపోయి ఉండేవాడా?: విజయసాయి

Vijaysai Reddy once again criticizes Chandrababu
  • చంద్రబాబుపై మరోమారు గళం విప్పిన విజయసాయి
  • ఎర్రన్నాయుడుకు కూడా వెన్నుపోటు పొడిచాడని ఆరోపణ
  • అవమానించాడని వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో మరోసారి తన గళం విప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు... ఎన్టీఆర్ కన్నా పెద్ద వెన్నుపోటును ఎర్రన్నాయుడుకు పొడిచాడని ఆరోపించారు. ఎర్రన్నాయుడు ఢిల్లీలో ఎక్కడ ఎదిగిపోతాడోనని ఎక్కడికక్కడ బ్రేకులు వేశాడని, అవమానించాడని తెలిపారు. అంతేగాకుండా, జగన్ పై తప్పుడు కేసులు పెట్టాలంటూ ఆయనను చంద్రబాబు వేధించాడని వెల్లడించారు. నాడు వైఎస్ జగన్ వంటి వారు సీఎంగా ఉండుంటే అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక చనిపోయి ఉండేవాడా? అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Errannaidu
Delhi

More Telugu News