Juhi Chawla: బర్త్ డే బాయ్ షారుఖ్ ఖాన్ కోసం 500 మొక్కలు నాటిన జుహీ చావ్లా

Juhi Chawla plants 500 trees on Sharukh Khan birthday
  • నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో పోస్టుల సందడి
  • షారుఖ్ కు శుభాకాంక్షలు తెలిపిన జుహీ
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా నిండా ఎస్ఆర్కే మేనియా కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నటి జుహీ చావ్లా కూడా షారుఖ్ ఖాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. షారుఖ్ పుట్టినరోజును పురస్కరించుకుని 'కావేరీ కాలింగ్' కార్యాచరణలో భాగంగా 500 మొక్కలు నాటానని జుహీ చావ్లా వెల్లడించారు.

తన సహ నటుడు, తన సహ నిర్మాత, తన సహ భాగస్వామి షారుఖ్ కు హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు. కష్టాలు, సుఖాలు కలగలిసిన వర్ణభరిత ప్రస్థానం అంటూ స్పందించారు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలో షారుఖ్ ఖాన్ తో పాటు జుహీ చావ్లా కూడా ఓ పార్ట్ నర్ అన్న విషయం తెలిసిందే. తమ జట్టు ఆడే మ్యాచ్ ల కోసం ఆమె భర్తతో కలిసి స్టేడియంలో సందడి చేస్తుంటారు.
Juhi Chawla
Sharukh Khan
Birthday
Plants
Bollywood
KKR
IPL 2020

More Telugu News