KL Rahul: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు 'ఏకలవ్య' అవార్డు

Teamindia vice captain KL Rahul to be honored with Ekalavya award by Karnataka government
  • ఇటీవల కాలంలో మెరుగ్గా ఆడుతున్న రాహుల్
  • కర్ణాటక అత్యుత్తమ క్రీడా పురస్కారానికి ఎంపిక
  • కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాహుల్
టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో వైస్ కెప్టెన్ గా నియమితుడైన కర్ణాటక స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ను 'ఏకలవ్య' అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం 'ఏకలవ్య'. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను 'ఏకలవ్య' అవార్డుకు ఎంపిక చేసినట్టు కర్ణాటక ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ నిర్ధారించాడు.

తనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందిస్తున్నందుకు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. అయితే, తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు తన కోచ్ లు, జట్టు సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారమే కారణమని, వారు లేకుండా తన అభ్యున్నతి సాధ్యమయ్యేది కాదని వినమ్రంగా పేర్కొన్నాడు. భవిష్యత్తులోనూ మరింత కఠోరంగా శ్రమించి కర్ణాటకకు, దేశానికి మరింత పేరు తెస్తానని కేఎల్ రాహుల్ ఉద్ఘాటించాడు.
KL Rahul
Ekalavya
Karnataka
Award
Team India
Cricket

More Telugu News