Sensex: ఊగిసలాటల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 143 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
Sensex ends 143 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 39,758కి చేరింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,669 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.10%), ఐసీఐసీఐ బ్యాంక్ (6.25%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (6.24%), యాక్సిస్ బ్యాంక్ (6.13%)  భారతి ఎయిర్ టెల్ (5.52%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-8.62%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.49%), టీసీఎస్ (-2.29%), ఏసియన్ పెయింట్స్ (-1.85%), టాటా స్టీల్ (-1.84%).

More Telugu News