KTR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి చేసిందేముంది?: కేటీఆర్

  • పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక అభివృద్ధి ఆగిపోయింది
  • మేము చేసిన అభివృద్దిని లెక్కలతో సహా చూపిస్తాం
  • దుబ్బాకలో ఘన విజయం సాధిస్తాం
BJP has done nothing to common man says KTR

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. సామాన్య మానవుడికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా చూపిస్తామని చెప్పారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని కేంద్రం చెపుతోందని మండిపడ్డారు. గత ఆరేళ్లలో రాష్ట్రం రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఇస్తే, తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చింది రూ. 1,43,329 కోట్లు మాత్రమేనని చెప్పారు.

గత ఆరేళ్లుగా తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. అయినా, బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం జనాల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అన్ని మతాలకు స్థానం ఉందని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం విపక్షాలకు సరికాదని చెప్పారు. మతం అనేది ఏ పార్టీకి కూడా ప్రచారాస్త్రం కాకూడదని అన్నారు.

More Telugu News