Tedros Adhanom Ghebreyesus: సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయిన 'డబ్ల్యూహెచ్ఓ' డైరెక్టర్ జనరల్!

  • సన్నిహితంగా తిరిగిన వ్యక్తికి కరోనా
  • ముందు జాగ్రత్తగా క్వారంటైన్ అయ్యాను
  • ఆరోగ్యం బాగానే ఉందన్న టెడ్రోస్
WHO Director in Self Quarentine

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసెస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవలి కాలంలో ఆయనతో సన్నిహితంగా తిరిగిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా టెడ్రోస్ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాద్వారా స్వయంగా వెల్లడించిన ఆయన, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

కరోనా సోకినట్టుగా ఇంతవరకూ తనకు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదని స్పష్టం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా, తాను స్వీయ నిర్భంధంలోకి వెళ్లానని, ఇంట్లోనే ఉండి, ఇకపై తన కార్యాలయం విధులను నిర్వహిస్తానని తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.68 కోట్ల మందికి పైగా కరోనా సోకగా, 12 లక్షల మందికి పైగా మరణించారన్న సంగతి తెలిసిందే.

More Telugu News