KCR: అన్ని రంగాల్లో సహకరిస్తున్నా, ఈ అసత్య ప్రచారాలేంటి?: కేసీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్

BJP Leader Laxman fires on kcr
  • తెలంగాణకు ఇప్పటి వరకు రూ. 70 వేల కోట్ల నిధులు
  • దోచుకోడానికి అవకాశం ఉండదనే విద్యుత్ బిల్లుపై అసత్య ప్రచారాలు
  • దళారులకు నష్టం కలుగుతుందనే వ్యవసాయ బిల్లుపై తప్పుడు ప్రచారం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లోనూ ఆదుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటి వరకు రూ. 70 వేల కోట్లను తెలంగాణకు కేటాయించినట్టు చెప్పారు. కేసీఆర్ నిరాశ, నిస్పృహలతోనే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దోచుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని నూతన విద్యుత్ బిల్లుపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళారులకు నష్టం కలుగుతుందన్న ఉద్దేశంతోనే వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News