Radhika: 'శక్తిమాన్' వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి రాధిక

Radhika gets anger over Shaktiman Mukesh Khanna comments
  • మీటూ ఉద్యమంపై ముఖేశ్ ఖన్నా వ్యాఖ్యలు
  • మహిళలు ఇంటిని చక్కదిద్దుకుంటే చాలన్న నటుడు
  • మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారంటూ రాధిక స్పందన
శక్తిమాన్ టీవీ సీరియల్ తో దేశవ్యాపంగా గుర్తింపు పొందిన నటుడు ముఖేశ్ ఖన్నాపై ప్రముఖ దక్షిణాది నటి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ముఖేశ్ ఖన్నా మీటూ ఉద్యమంపై వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంలో తాము పురుషులతో సమానం అని మహిళలు భావించడం వల్లే మీటూ ఉద్యమం తయారైందని ముఖేశ్ ఖన్నా అభిప్రాయపడ్డారు. మహిళలు ఇంటిని చక్కదిద్దుకుంటే చాలు అని వ్యాఖ్యానించారు.

దీనిపై రాధిక స్పందిస్తూ, ఈ మతిలేని మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలకు దూరంగా ఉండడమే మేలు అని అభిప్రాయపడ్డారు. కొందరు మూర్ఖత్వంతోనే ఇలా మాట్లాడతారని మండిపడ్డారు.

అంతకుముందు, ముఖేశ్ వ్యాఖ్యలపై గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా విరుచుకుపడ్డారు. కొందరి మానసిక పరిస్థితి చూస్తుంటే ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు.
Radhika
Mukesh Khanna
MeToo
Chinmayi

More Telugu News