Varalakshmi: వరలక్ష్మికి అఖిల్ తో ప్రేమ వ్యవహారం ఉంది: గాజువాక సీఐ మల్లేశ్వరరావు

Police investigates Varalakshmi murder case in Gajuwaka
  • గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం
  • వరలక్ష్మి అనే విద్యార్థినిని అంతమొందించిన అఖిల్
  • దర్యాప్తు వేగవంతం చేశామన్న సీఐ
గాజువాకలో అఖిల్ వెంకటసాయి అనే కుర్రాడు వరలక్ష్మి అనే విద్యార్థినిని దారుణంగా అంతమొందించడంపై సీఐ మల్లేశ్వరరావు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వరలక్ష్మి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలిపారు.  హత్య జరిగిన ప్రదేశంలో బ్లేడ్, వరలక్ష్మి చున్నీతో పాటు మరికొన్ని ఆధారాలు సేకరించినట్టు చెప్పారు. అఖిల్ తో వరలక్ష్మికి ప్రేమ వ్యవహారం ఉందని తెలిపారు. అయితే రామ్ అనే మరో యువకుడితో వరలక్ష్మి సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించిన అఖిల్ ఈ హత్యకు పాల్పడ్డాడని సీఐ వివరించారు.

ఘటన జరిగిన సమయంలో స్పాట్ లో అఖిల్, వరలక్ష్మి మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత అఖిల్ పారిపోతుండగా వరలక్ష్మి సోదరుడు చూశాడని తెలిపారు. ఈ కేసులో రామ్ ను కూడా విచారించామని, కేసును దిశ విభాగానికి బదిలీ చేశామని అన్నారు.
Varalakshmi
Akhil
Gajuwaka
Murder
Police

More Telugu News