Jagan: గాజువాక ఘాతుకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్... బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల సాయం

CM Jagan furious after learnt about Gajuwaka murder
  • గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం
  • ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి హత్య
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్

విశాఖపట్నం గాజువాకలో ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి హత్య చేయడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి ఘాతుకాలు జరగకుండా చూడాలంటూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్నీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

మహిళల భద్రత విషయంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా చైతన్యం తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో, మృతురాలి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సీఎం జగన్... వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలంటూ హోంమంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

గాజువాకలో నిన్న రాత్రి అఖిల్ వెంకటసాయి అనే ప్రేమోన్మాది ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి అనే యువతిని గొంతుకోసి చంపడం సంచలనం సృష్టించింది. మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతోనే అఖిల్ ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News