Gorantla Butchaiah Chowdary: కోడికత్తిని మన రాష్ట్ర ఆయుధంగా ప్రకటిస్తారేమో!: గోరంట్ల వ్యంగ్యం

Gorantla satirical post in twitter
  • సెటైరికల్ ట్వీట్ చేసిన గోరంట్ల
  • ఆవ భూముల్ని పర్యాటక కేంద్రంగా చేస్తారేమో అంటూ వ్యాఖ్యలు
  • శిలలపై శిల్పాలు చెక్కినారు అంటూ ఎద్దేవా
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యంగ్యం ప్రదర్శిస్తూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. కోడికత్తిని మన రాష్ట్ర ఆయుధంగా ప్రకటిస్తారేమోనని సెటైర్ వేశారు. రాష్ట్ర పర్యాటక కేంద్రంగా ఆవ భూముల్ని, రాష్ట్ర వాహనంగా పొక్లెయిన్ ని, రాష్ట్ర ఆదివారంగా శుక్రవారాన్ని, రాష్ట్ర భాషగా బూతులను, రాష్ట్ర క్రీడగా క్రికెట్ బెట్టింగ్ లను పెడతారేమో అంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి శిలలపై శిల్పాలు చెక్కినారు... నదులతో ఇసుకను భుక్కినారు అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వ్యంగ్య చిత్రాన్ని కూడా ఆయన పంచుకున్నారు.
Gorantla Butchaiah Chowdary
Tweet
Satire
Telugudesam
Andhra Pradesh

More Telugu News