Sunrisers Hyderabad: తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్

Sunrisers Hyderabad won the toss and elected bowl first in crucial match
  • షార్జాలో నేడు బెంగళూరుతో హైదరాబాద్ ఢీ
  • బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • వరుసగా రెండు మ్యాచ్ లు గెలిస్తేనే సన్ రైజర్స్ కు ప్లేఆఫ్ బెర్తు!
ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ప్లేఆఫ్ ముంగిట హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం అనేక జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.

టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉండడంతో, ఆ రెండింట నెగ్గితేనే సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ కు వెళ్లగలుగుతుంది! అది కూడా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంది. దాంతో బెంగళూరుతో పోరును సన్ రైజర్స్ తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇక, ఈ మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. శివం దూబే, స్టెయిన్ స్థానంలో నవదీప్ సైనీ, ఇసురు ఉదన జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో గాయపడిన విజయ్ శంకర్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ తెలిపాడు.
Sunrisers Hyderabad
Toss
Royal Challengers Banglore
Sharjah
PlayOff
IPL 2020

More Telugu News