DK Aruna: కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీని అమ్మేశారు: డీకే అరుణ

  • దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయం
  • టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదు
  • కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది
There is no existance of Congress says DK Aruna

దుబ్బాక ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి, సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీజేపీ అభ్యర్థి రఘునందన్ తో కలిసి దుబ్బాక మండలం ఆకారం, గంభీర్ పూర్ గ్రామాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రఘునందన్ రావు గెలవడం ఖాయమని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీని అమ్మేశారని, రాహుల్ గాంధీ కూడా కనిపించడం లేదని అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించే దమ్ము కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. దుబ్బాకకు ఇంత వరకు ఏమీ చేయని టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు కూడా లేదని అన్నారు. బీజేపీని అడ్డుకోవడం కోసమే టీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని విమర్శించారు.

More Telugu News