'గీతం' వ్యవహారం కూడా నా పుస్తకంలో ఉంది: ఐవైఆర్

31-10-2020 Sat 17:35
  • గీతం భూముల వ్యవహారంపై స్పందించిన ఐవైఆర్
  • తాను రాసిన పుస్తకంలోని అంశాలను పంచుకున్న వైనం
  • గీత దాటిన మూర్తి అంటూ ఏకంగా అధ్యాయమే రాసిన ఐవైఆర్
IYR Krishna Rao shares some pages of his book

మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు గీతం భూముల వ్యవహారంపై స్పందించారు. 'నవ్యాంధ్ర నా నడక' అనే పుస్తకంలో ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి రాసిన అధ్యాయంలోని పేజీలను పంచుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. గీతం వ్యవహారం కూడా ఈ అధ్యాయంలోనే ఉందని తెలిపారు. కాగా, ఆ పుస్తకంలో గీత దాటిన మూర్తి అంటూ ఐవైఆర్ అనేక అంశాలను పొందుపరిచారు.

అప్పట్లో గీతం సంస్థల చైర్మన్ ఎంవీఎస్ మూర్తి గురించి ఓ అధ్యాయమే రాశారు. తనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించాక ఎంవీఎస్ మూర్తి "దరిద్రం వదిలిపోయింది" అని వ్యాఖ్యానించారని ఐవైఆర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో గీతం విద్యాసంస్థల భూముల్లోని పలు నిర్మాణాలను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.