ఆ రోజు 'వాల్మీకి' అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా?: నాగబాబు

31-10-2020 Sat 16:43
  • నేడు వాల్మీకి జయంతి
  • హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారూ అంటూ నాగబాబు ట్వీట్
  • మంచి మాస్ కథలు రాసేవాళ్లలో మీరే ప్రథములంటూ వ్యాఖ్యలు
Nagababu tweets on Valmiki Jayanti

రామాయణ కావ్యాన్ని రచించిన మహా రచయిత వాల్మీకి జయంతి సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. గతంలో తన కుమారుడు వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేశ్' చిత్రం రిలీజ్ కు ముందు వివాదాస్పదమైన ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆరోజు 'వాల్మీకి' అని టైటిల్ పెడితే గొడవ చేసేశారు కదా అని పేర్కొన్నారు. మరి వాళ్లకి ఈ రోజు వాల్మీకి జయంతి అని గుర్తుండే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. "ఏదేమైనా... హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారూ" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

"నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్లలో మీరే ప్రథములు. రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ చిత్రం గద్దలకొండ గణేశ్ చిత్రానికి మొదట వాల్మీకి అనే టైటిల్ ఫిక్స్ చేయగా, తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రిలీజ్ కు ముందు టైటిల్ మార్చేయడం తెలిసిందే.