Nara Lokesh: నీ లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు నీ పతనాన్ని శాసిస్తారు: నారా లోకేశ్

Nara Lokesh responds to ongoing situations in Amaravati movement
  • రాజధాని ఉద్యమం ఉద్ధృతం
  • మహిళలు గాయపడిన వీడియో పోస్టు చేసిన లోకేశ్
  • దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం అంటూ వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజధాని ఉద్యమంలో మహిళలు గాయపడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అన్నంపెట్టే భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అన్నదాత త్యాగాల పునాదిని సమాధి చేసే కుట్రలు పన్నారని ఆరోపించారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్లజూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై దుశ్శాసనపర్వం సాగిస్తున్న దుష్టపాలనకు చరమగీతం పాడే మహోద్యమం ఇది అని ఉద్ఘాటించారు. "నీ లాఠీలు, తుపాకులు, నిర్బంధాలను ఎదిరించి మరీ వీరవనితలు నీ పతనాన్ని శాసిస్తారు... ప్రజా రాజధానిని శాశ్వతం చేస్తారు" అని స్పష్టం చేశారు.
Nara Lokesh
Amaravati
Women
Video
Telugudesam

More Telugu News