మందారాల ఫొటోలు అద్భుతంగా తీసి పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి!

31-10-2020 Sat 12:04
  • ఫొటోలు తీసి కవిత  
  • ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుంది మా ఇంటి మందారం
  • తన  కొప్పుని  సింగారించింది
  • అలవోకగా నా కెమెరా కంటికి చిక్కింది
chiru shares pics

తనలోని ఫొటోగ్రాఫర్‌ను బయటకు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన ఇంటి వద్ద పూసిన మందారాలను అందంగా ఫొటోలు తీసి, వాటిపై కవిత రాసి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన  కొప్పుని  సింగారించింది.. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిపింది’ అని ఆయన కామెంట్ చేశారు.
 
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటూ హాబీలతో కాలక్షేపం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఫొటోలను తీస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఫొటోలు తీయడమంటే ఆయనకు చాలా ఇష్టం.