Tungabhadra Pushkaralu: తుంగభద్ర పుష్కరాలు‌.. కఠిన ఆంక్షలు విధించిన ఏపీ ప్రభుత్వం!

  • త్వరలో ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు
  • 12 ఏళ్ల లోపు పిల్లలకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు నో ఎంట్రీ
  • ఘాట్ వద్ద 15 నిమిషాలు మాత్రమే ఉండేందుకు అనుమతి
AP govt puts restrictions amid Tungabhadra Pushkaras

నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్న నేపథ్యంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది. కరోనా నేపథ్యంలో షరతులను విధించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలు ఇవే.

  • 12 ఏళ్ల లోపు పిల్లలకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు అనుమతి లేదు.
  • పుష్కరాలకు వచ్చే వారు గుర్తింపు కార్డుతో పాటు, ఈపాస్ తీసుకురావాలి.
  • ఈపాస్ కోసం వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన మెసేజ్ ను పుష్కరఘాట్ వద్ద అధికారులకు చూపించాలి.
  • వెబ్ సైట్ లో పుష్కరఘాట్లు, రవాణా సదుపాయాల ఏర్పాట్ల వివరాలు ఉంటాయి.
  • నిర్ణీత సమయంలోనే పుష్కరఘాట్ కు రావాల్సి ఉంటుంది.
  • ఘాట్ వద్ద కేవలం 15 నిమిషాలు ఉండేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ఆ తర్వాత ఘాట్ ను శానిటైజ్ చేసి, మరో బ్యాచ్ ను అనుమతిస్తారు.
  • ఘాట్ వద్ద ఒక్కసారి కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
  • ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో... తెలుగుతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా సమాచార బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News