కన్నీరు పెట్టుకున్న యాంకర్ రష్మి.. వీడియో వైరల్

31-10-2020 Sat 12:08
  • ఈటీవీలో ప్రసారమయ్యే  'ఢీ' డ్యాన్స్ షోలో భావోద్వేగం
  • 'మగువా మగువా..' పాటకు కంటెస్టెంట్స్‌ డ్యాన్స్
  • పురుషులు మహిళలను ప్రశ్నిస్తున్నారన్న ప్రియమణి
  • భావోద్వేగంతో ఏడ్చిన యాంకర్లు
rashmi video goes viral

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' డ్యాన్స్ షోకి సంబంధించిన కొత్త ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పలువురు కంటెస్టెంట్స్‌ తమ డ్యాన్స్‌తో న్యాయనిర్ణేతలను ఆకర్షించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ నుంచి 'మగువా మగువా..' పాటకు ఓ గ్రూప్ చేసిన‌ పెర్ఫామెన్స్‌తో ఈ 'షో'లో ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతుండగా యాంకర్ రష్మి కన్నీరు పెట్టుకుంది.

ఇటీవల తాను సోషల్ మీడియాలో ఓ ఇంటర్వ్యూ చూశానని, అందులో ఒకతను మాట్లాడుతూ, 'అసలు ఆడవాళ్లు ఎందుకు పనిచేయాలి? అమ్మాయిలు తమ శరీరం కనిపించేలా పొట్టి దుస్తులు ఎందుకు ధరించాలి? అసలు ఆడవాళ్లు ఇంట్లోనే ఉంటే ఇలాంటివి జరగవు కదా? అన్నాడు. ఇంకా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలామంది పురుషులు ఇలాగే మాట్లాడారని చెప్పింది. మహిళల పట్ల కొందరు పురుషుల్లో అటువంటి అభిప్రాయాలు వున్నాయని ఆమె చెప్పడంతో, రష్మితో పాటు వర్షిణి కూడా కంటతడి పెట్టింది.