ఐఐటీ బాంబేలో నేడు ప్రసంగించనున్న చంద్రబాబు

31-10-2020 Sat 09:54
  • ఐఐటీలో గ్లోబల్ లీడర్ సమ్మిట్
  • వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగం
  • 12 గంటలకు విద్యార్థులతో ముచ్చటించనున్న చంద్రబాబు
TDP Chief Chandrababu today talk to IIT Bombay Students

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి మధ్యాహ్నం 12 గంటలకు ముంబై ఐఐటీలో ప్రసంగించనున్నారు. ‘మేనేజ్‌మెంట్ స్కూల్ అవెన్యూస్’ పేరుతో ఐఐటీకి చెందిన శైలేష్ జె మెహతా అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్ సమ్మిట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రోజుకొకరు ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు.