దేశంలో కొత్తగా 48,268 మందికి కరోనా

31-10-2020 Sat 09:54
  • కోలుకున్న మరో  59,454 మంది 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119
  • మృతుల సంఖ్య 1,21,641
  • యాక్టివ్ కేసులు 5,82,649  
With 48268 new COVID19 infections

కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 48,268 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదే సమయంలో 59,454 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 551 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,21,641 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 74,32,829 మంది కోలుకున్నారు. 5,82,649 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.